విషాదం: ప్రముఖ నటుడు మృతి

Published on Jun 5, 2023 1:35 pm IST

సౌత్ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు కొల్లం సుధీ(39) కారు ప్రమాదంలో మృతి చెందారు. ఈ రోజు తెల్లవారుజామున సుధీ మరో ముగ్గురు నటులతో కలిసి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందులో తీవ్రంగా గాయపడిన సుధీ ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉనట్టు తెలుస్తోంది. కట్టప్పనా, కుట్టనాదన్, తేట రప్పై, వాకతిరివ్ వంటి చిత్రాల్లో సుధీ నటించారు. ఆయన మరణం నిజంగా గుండెల్ని పిండేస్తుంది అంటూ కొల్లం సుధీ సన్నిహితులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.

కొల్లం సుధీ తమను ఎప్పుడు కలిసినా అందరూ ఆనందంగా వుండండి అని చెబుతూ ఉండేవారు అని అతని స్నేహితులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి’ అని కోరుకుంటున్నారు. మా 123తెలుగు.కామ్ తరఫున కొల్లం సుధీ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం :