ఆ హీరోతో కొరటాల శివ నెక్స్ట్ సినిమా ?

కొరటాల శివ చేసింది తక్కవ సినిమాలే అయినా అవి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించడంతో టాప్డైరెక్టర్స్ లిస్ట్ లోకి చేరుకున్నాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమా తెరాకేక్కిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీమంతుడు సినిమా తరువాత మహేష్ , కొరటాల చేస్తున్న సినిమా కావున ఈ ప్రాజెక్ట్ పై భారి అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా తరువాత కొరటాల ఏ సినిమా చెయ్యబోతున్నాడు అనే విషయం పై రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో చరణ్ తో కొరటాల సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి కాని సినిమా మొదలవ్వలేదు. తాజా సమాచారం మేరకు భరత్ అనే నేను సినిమా తరువాత కొరటాల బన్ని తో సినిమా చెయ్యబోతున్నాడని తెలుస్తుంది. ఈ విషయం పై మరికొన్ని రోజుల్లో క్లారిటి రానుంది.