ఓటిటి టైం ని లాక్ చేసుకున్న “కోటబొమ్మాళి పి ఎస్”.!

ఓటిటి టైం ని లాక్ చేసుకున్న “కోటబొమ్మాళి పి ఎస్”.!

Published on Dec 31, 2023 12:31 PM IST

సీనియర్ నటుడు శ్రీకాంత్ అలాగే యంగ్ నటీ నటులు రాహుల్ విజయ్ మరియు శివాని రాజశేఖర్ ల కలయికలో తెరకెక్కిన చిత్రం “కోటబొమ్మాళి పి ఎస్”. మరి డీసెంట్ బజ్ అండ్ ప్రమోషన్స్ నడుమ వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లు అందుకొని హిట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రంని దర్శకుడు తేజ మార్ని తెరకెక్కించగా ఫైనల్ గా ఈ సినిమా అఫీషియల్ ఓటిటి టైం వచ్చేసింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు కన్ఫామ్ చేశారు. అయితే డేట్ ఏంటి అనేది ఇంకా లాక్ చేయలేదు కానీ సంక్రాంతి సీజన్ ని లాక్ చేసారు. మరి ఈ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ ని చూడాలి అనుకునేవారికి ఈ చిత్రం అప్పుడు మంచి ఛాయిస్ గా నిలుస్తుంది అని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు