“వీరమల్లు” కి క్రిష్ అదిరే ప్లానింగ్స్..లొకేషన్స్ వైరల్.!

Published on Nov 25, 2021 9:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దర్శకుడు సాగర్ కె చంద్ర తో “భీమ్లా నాయక్” అనే పవర్ ఫుల్ మాస్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇది లైన్ లో ఉండగానే పవన్ విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో ఓ భారీ సినిమా “హరిహర వీరమల్లు” కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ లెవెల్లో భారీ హంగులతో ఈ సినిమా విజువల్ వండర్ గా తెరకెక్కుతుంది.

అయితే పలు కారణాల చేత ఆలస్యంగానే పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం మళ్ళీ షూట్ రీస్టార్ట్ కి సన్నద్ధం అవుతుంది. అయితే తాజాగా క్రిష్ మరియు తన బృందం ఈ సినిమా లొకేషన్స్ వేటలో ఉన్నట్టుగా కొన్ని ఫోటోలు బయటకి వచ్చి వైరల్ అవుతున్నాయి. ఈ లొకేషన్స్ చూస్తుంటే వీటిలో కూడా ఏవో అదిరే సీక్వెన్స్ లనే ప్లాన్ చేస్తున్నారనిపిస్తుంది.

ఆల్రెడీ ఈ సినిమాలో భారీ సెట్టింగ్స్ యాక్షన్ బ్లాక్ లు రెడీ అయ్యాయి. మరి ఈ లొకేషన్స్ లో ఎలాంటి సన్నివేశాలు తీస్తారో చూడాలి. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు..

సంబంధిత సమాచారం :

More