ఆ సీరియల్ ప్రోమో కోసం బేబమ్మ షాకింగ్ రెమ్యునరేషన్?

Published on Jul 27, 2021 3:00 am IST

ఉప్పెన సినిమాతో బేబమ్మగా తెలుగువారికి పరిచయమైన కన్నడ బ్యూటీ ‘కృతిశెట్టి’ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి తన ఇమేజ్‌ను మరింత పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. అయితే న్యాచురల్ స్టార్ నాని ‘శ్యామ్‌ సింగరాయ, ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పోతినేని “రాపో 19” సినిమాలో, సుధీర్‌బాబు ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వంటి పలు సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతుంది.

ఇదిలా ఉంటే కృతి శెట్టి ఓ తెలుగు సీరియల్ ప్రోమోలో కనిపించింది. త్వరలోనే జీ తెలుగులో ప్రసారం కానున్న సీరియల్ ‘ముత్యమంత ముద్దు’ ప్రోమో నిన్న ప్రసారం అయ్యి మంచి రెస్పాన్స్‌ని తెచ్చుకోగలిగింది. ఈ సీరియల్‌లో నటించినందుకు కృతి ఏకంగా కోటి రూపాయలు పారితోషికంగా తీసుకుందని టాక్ వినిపిస్తుంది. అయితే కృతికి ఉన్న క్రేజ్‌ని బట్టి సీరియల్ ప్రోమోకైనా భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :