తెలుగులో తన ఫేవరెట్ సినిమాలు రివీల్ చేసిన కృతి సనన్.!

తెలుగులో తన ఫేవరెట్ సినిమాలు రివీల్ చేసిన కృతి సనన్.!

Published on Nov 19, 2022 3:00 PM IST

ఇప్పుడు మన టాలీవుడ్ సినిమా ఏ రేంజ్ లో సత్తా చాటుతుందో తెలిసిందే. గత ఏడాది పుష్ప నాటి నుంచి ఈ ఏడాది కార్తికేయ 2 వరకు అనేక చిత్రాలు మన టాలీవుడ్ నుంచి హిందీ మార్కెట్ లో కూడా సాలిడ్ రెస్పాన్స్ ని అందుకున్నాయి. ఇక దీనితో పాటుగా హిందీ నుంచి కూడా ఇప్పుడు రిలీజ్ లు మన తెలుగులో కూడా ఎక్కువ కావడం మొదలు పెట్టాయి.

మంచి ప్రమోషన్స్ నడుమ లేటెస్ట్ గా రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రం “భేడియా”. తెలుగులో “తోడేలు” పేరిట మేకర్స్ రిలీజ్ చేస్తుండగా బాలీవుడ్ స్టార్ నటులు వరుణ్ ధావన్ మరియు ఆదిపురుష్ నటి కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి లేటెస్ట్ గా టాలీవుడ్ లో జరిగిన ఇంటరాక్షన్ లో అయితే తన రీసెంట్ తెలుగు చిత్రాలు ఏవో కృతి రివీల్ చేసింది.

తనకు అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప అలాగే రాజమౌళి, ఎన్టీఆర్ రామ్ చరణ్ ల RRR చిత్రాలు బాగా నచ్చాయి అని చెప్పుకొచ్చింది. దీనితో బన్నీ మరియు ఎన్టీఆర్ చరణ్ అభిమానులలో ఈ మాటలు మంచి వైరల్ గా మారుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు