పవన్ తో షూటింగ్ మొదటిరోజు స్కూల్ లా ఉందన్న కుష్బు !
Published on Apr 12, 2017 5:36 pm IST


తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన సీనియర్ నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ కుష్బు ప్రస్తుతం తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. తెలుగులో చివరగా చిరంజీవి ‘స్టాలిన్’ సినిమాలో కనిపించిన ఆమె దాదాపు 9 ఎళ్ళ తర్వాత పవన్ – త్రివిక్రమ్ ల చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. చాలా ఎళ్ళ క్రితమే సినిమాల్ని పూర్తిగా పక్కనబెట్టి రాజకీయాల్లో బిజీగా ఉన్న కుష్బు దర్శకుడు త్రివిక్రమ్ చెప్పిన కథ, అందులోని తన పాత్ర నచ్చడంతో ఈ సినిమాకు ఓకే చెప్పారు.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ కోసం ఆమె హైదారాబాద్ వచ్చారు. నిన్న షూటింగ్లో కూడా పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత షూటింగ్ కు వెళ్లడం మొదటిరోజు స్కూల్ కు వెళ్ళినట్టే ఉందని, మర్చిపోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని ట్విట్టర్ ద్వారా తన అనుభవాన్ని తెలిపారు. ఈ చిత్రం కోసం ఆమె మరో 10 రోజులు ఇక్కడే ఉండనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

 
Like us on Facebook