
బాలకృష్ణ నటిస్తున్న లయన్ సినిమా ఆడియో ఈ నెల 9న విడుదలకానుందని 123తెలుగు ముందుగానే తెలిపింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఆడియో హక్కులను భారీ ధరకు లహరీ మ్యూజిక్ సొంతం చేసుకుంది.
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వేడుకకు ముఖ్యఅతిధిగా హాజరుకానున్నాడు. శిల్పకళావేదిక ఈ వేడుకకి ఆస్థానమివ్వనుంది. సత్యదేవా దర్శకుడు. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. చాలా రోజుల తరువాత మణిశర్మ సంగీతాన్ని అందించాడు.

