డిజిటల్ ప్రీమియర్ గా లక్ష్య…ఎప్పుడంటే?

Published on Dec 27, 2021 12:30 pm IST

నాగ శౌర్య హీరోగా ధీరేంద్ర సంతోష్ జాగర్ల పూడి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం లక్ష్య. స్పోర్ట్స్ డ్రామా గా ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మించారు. కాల భైరవ సంగీతం అందించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం గా ఉంది.

లక్ష్య చిత్రం వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన ఆహా వీడియో లో ప్రసారం కానుంది. కేతీక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో జగపతి బాబు, సచిన్ ఖేదేకర్ లు కీలక పాత్రల్లో నటించడం జరిగింది. డిజిటల్ ప్రీమియర్ గా వస్తున్న ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :