హృతిక్ “ఫైటర్” ఓటీటీ రిలీజ్ అప్పుడే?

హృతిక్ “ఫైటర్” ఓటీటీ రిలీజ్ అప్పుడే?

Published on Jan 31, 2024 7:03 AM IST


బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా స్టార్ నటి దీపికా పదుకోన్ హీరోయిన్ గా దర్శకుడు సిద్ధార్ట్ ఆనంద్ తెరకెక్కించిన భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ చిత్రం “ఫైటర్”. మరి కాస్త లో బజ్ లోనే రిలీజ్ అయ్యిన ఈ చిత్రం తక్కువ ఓపెనింగ్స్ నే అందుకుంది కానీ రెండో రోజు పికప్ అయ్యింది. అయితే మళ్లీ వర్కింగ్ డే కి వచ్చేసరికి భారీగా వసూళ్లు డ్రాప్ అయ్యాయి.

అయితే ఈ చిత్రం థియేట్రికల్ గా త్వరగానే రన్ ని ముగించుకుంటుంది అని అర్ధం అయ్యిపోయింది. దీనితో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ త్వరలోనే వచ్చేస్తుంది అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపై లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. దీనితో ఈ చిత్రం రానున్న మార్చ్ లో అయితే స్ట్రీమింగ్ కి వస్తుంది అని వినిపిస్తోంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు