నైజాంలో “యశోద” లేటెస్ట్ వసూళ్ల వివరాలు.!

నైజాంలో “యశోద” లేటెస్ట్ వసూళ్ల వివరాలు.!

Published on Nov 16, 2022 2:00 PM IST

సమంత ప్రభు మెయిన్ లీడ్ లో చేస్తున్నటువంటి లేటెస్ట్ చిత్రాల్లో మంచి బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో దర్శకులు హరి అండ్ హరీష్ లు తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “యశోద” కూడా ఒకటి. ఇంట్రెస్టింగ్ నేపథ్యంతో తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని రిలీజ్ అయ్యి సమంత కెరీర్ లో మంచి ఓపెనింగ్స్ ని ఈ చిత్రం అందుకుంది. ఇక ఇప్పటికీ మంచి రన్ ని కొనసాగిస్తున్న ఈ చిత్రం తెలుగు స్టేట్స్ లో వీక్ డేస్ లో కొంచెం డల్ అయ్యింది.

ఇక లేటెస్ట్ గా అయితే నైజాం లో ఈ చిత్రం ఐదవ రోజు వసూళ్ల డీటెయిల్స్ తెలుస్తున్నాయి. మరి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే ఈ చిత్రం నైజాం లో 47 లక్షల గ్రాస్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదైతే ఇక్కడ డీసెంట్ నెంబర్ అనే చెప్పొచ్చు. ఇక ఈ వారంలో కూడా అంత చెప్పుకోదగ్గ రిలీజ్ లు లేవు కాబట్టి మళ్ళీ వీకెండ్స్ లో యశోద పుంజుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు