లేటెస్ట్..”పుష్ప” రిలీజ్ పై సరికొత్త ఊహాగానాలు!

Published on Oct 1, 2021 12:25 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. మరి ఈ భారీ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా మేకర్స్ ఈ సినిమాని డిసెంబర్ నెలకి కన్ఫర్మ్ చేశారు. అంతే కాకుండా ఈ చిత్రం డిసెంబర్ 17 కి ఫిక్స్ అయ్యింది అని కూడా టాక్ వినిపిస్తుంది.

అయితే మొదటగా క్రిస్మస్ రేస్ ని పాన్ ఇండియన్ లెవెల్లో స్టార్ట్ చేసింది పుష్ప సినిమానే. కానీ ఇప్పుడు ఇదే సమయానికి గాను మరిన్ని భారీ సినిమాలు కూడా రేస్ లో నిలుస్తుండడం ఆసక్తిగా మారింది. దీనితో పుష్ప రిలీజ్ వచ్చే ఏడాదికి వాయిదా పడొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై మేకర్స్ మళ్ళీ ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని చెప్పాలి. మరి ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :