మెగా మాస్..”గాడ్ ఫాథర్” పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Aug 7, 2022 7:04 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న పలు భారీ మల్టీ స్టారర్స్ లో దర్శకుడు మోహన్ రాజాతో చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ “గాడ్ ఫాథర్” కూడా ఒకటి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. మరి ఎక్కడికక్కడ సాలిడ్ హంగులతో ప్లాన్ చేసిన ఈ సినిమాపై లేటెస్ట్ గా ఓ టాక్ బయటకి వచ్చినట్టు తెలుస్తుంది.

సినిమా ఆల్రెడీ ఆల్ మోస్ట్ పూర్తి కాగా ఇప్పటి వరకు వచ్చిన అవుట్ పుట్ తో అయితే మేకర్స్ సూపర్ హ్యాపీ గా ఉన్నారట. దీనితో సినిమా ఫలితంపై వారికి మరింత కాన్ఫిడెన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాతో అయితే మళ్ళీ మెగాస్టార్ తన మెగా మాస్ కం బ్యాక్ ఇవ్వడం ఖాయం అనిపిస్తుంది. రీసెంట్ గా చిరు మరియు సల్మాన్ పై కనిపించిన ఓ లీక్ స్టిల్ కూడా మంచి హైప్ నెలకొల్పింది. మరి ఈ సినిమా అయితే ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :