ఈతరం పెళ్లి సందD కి రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Oct 1, 2021 1:30 pm IST

సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రోషన్ హీరోగా మరో యువ నటి శ్రీ లీల హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “పెళ్లి సందD”. శ్రీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందులోని దర్శకేంద్రుని సినిమా అయినటువంటి పెళ్లి సందడికి కొత్త వెర్షన్ గా ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి మంచి బజ్ ని సంతరించుకుంది.

అయితే ఇపుడు ఈ సినిమా ఫైనల్ గా రిలీజ్ డేట్ ని తెచ్చేసుకుంది. వచ్చే అక్టోబర్ 15 న దసరా కానుకగా ఈ సినిమాని మేకర్స్ రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందివ్వగా ఆర్ కె ఫిలిమ్స్ వారు అలాగే ఆర్కా మీడియా వారు నిర్మాణం వహించారు. మరి ఈ సినిమా మళ్ళీ పాత పెళ్లి సందడి మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :