‘రాజమౌళి – మహేష్’ సినిమా పై మరో గాసిప్

Published on Jun 6, 2023 2:30 am IST

రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క ఈ సినిమా గురించి ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉంది. తాజాగా మరో కొత్త రూమర్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన దీపికా పడుకోణె నటించబోతుంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ మధ్య అయితే మహేష్ సరసన బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించబోతుందని టాక్ నడిచింది.

ఇప్పుడు మహేష్ కి దీపికా పడుకోణె హీరోయిన్ గా ఫిక్స్ అయింది అంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ సినిమాకు సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు. కాకపోతే.. ఈ సినిమా రచయిత విజయేంద్రప్రసాద్‌ రాసిన కథలో హీరోయిన్ పాత్ర చాలా కీలకం అని.. అందుకే ఆ పాత్రలో ఓ స్టార్ నటి నటిస్తే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక విజయేంద్రప్రసాద్‌, మహేశ్‌ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్టు రాశారట. ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :