లేటెస్ట్..శంకర్ లైన్ మొత్తం క్లియర్ అసలు మ్యాటర్ ఇదే.!

Published on Oct 29, 2021 8:00 am IST

ఇండియన్ సినిమా దగ్గర తన సినిమాలకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఐకానిక్ దర్శకుడు శంకర్. తన సినిమా సబ్జెక్టులతో భారీ విజువల్స్ తో ఇండియన్ సినిమాని మరో స్థాయిలో శంకర్ నిలబెట్టారు అది అందరికీ తెలిసిందే. కానీ శంకర్ కి వివాదాలు కూడా ఎక్కువే.. తన సినిమాలు పరంగా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. అలా కోలీవుడ్ కి చెందిన బిగ్ బ్యానర్ లైకా ప్రొడక్షన్స్ కి శంకర్ కి తమ సినిమా “ఇండియన్ 2” పట్ల పలు వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే.

దీనిపై కేసు కూడా ఎపుడు నుంచో నడుస్తుంది. శంకర్ భారతీయుడు 2 కంప్లీట్ చెయ్యకుండా బయటకి రావడం తర్వాత వారు రామ్ చరణ్ తో చేసే సినిమాకి అలాగే అపరిచితుడు హిందీ రీమేక్ కి అడ్డంకులు పెట్టడం కూడా జరిగాయి. కానీ ఫైనల్ గా దీనికి శంకర్ మరియు ఈ నిర్మాతలు ఒక ఎండ్ కార్డ్ వేసినట్టు సమాచారం.

ఇద్దరూ కూడా బయట ఒక ఒప్పందానికి వచ్చారట. రామ్ చరణ్ తో సినిమా అయ్యాక “భారతీయుడు 2” కంప్లీట్ చేస్తానని శంకర్ చెప్పగా లైకా వారు కూడా రామ్ చరణ్ సినిమాకి అలాగే అపరిచితుడు హిందీ రీమేక్ కి కూడా ఎలాంటి అడ్డంకులు సృష్టించమని ఒప్పందం కుదుర్చుకున్నారట. సో ఎట్టకేలకు శంకర్ కి లైన్ క్లియర్ అయ్యినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More