బోయపాటితో కూడా బన్నీ పాన్ ఇండియానే !

Published on Dec 19, 2021 10:42 pm IST

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ‘అఖండ’తో భారీ హిట్ కొట్టాడు. ఇక తన తరువాత సినిమాని బోయపాటి బన్నీతో ప్లాన్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ నుంచి స్టార్ట్ కానుందని… అలాగే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే బన్నీ కోసం బోయపాటి ఓ భారీ యాక్షన్ స్క్రిప్ట్ ను రెడీ చేశాడట.

కాగా ఆల్ రెడీ సరైనోడు అనే సూపర్ హిట్ సినిమా వీరి ఖాతాలో ఉంది కాబట్టి .. వీరిద్దరి కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉంటాయి. ఏది ఏమైనా హీరో ఎవరైనా తన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ను పక్కాగా ప్లాన్ చేసి హిట్ కొట్టడంలో బోయపాటికి మంచి అనుభవం ఉంది. పైగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించనున్నాడు.

సంబంధిత సమాచారం :