పవన్ “వీరమల్లు” పై లేటెస్ట్ అప్డేట్.!

పవన్ “వీరమల్లు” పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Oct 29, 2022 3:00 PM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిశి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “హరిహర వీరమల్లు”. పవన్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా సహా అత్యధిక బడ్జెట్ సినిమా కూడా ఇదే కావడంతో ఈ సినిమాపై అనేక అంచనాలు అయితే నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం షూటింగ్ అయితే ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతుండగా సినిమా పై ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది.

ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకి గాను హిందీ నటుడు బాబీ డియోల్ నటించనున్నట్టు తెలుస్తుంది. మరి తాను అయితే ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్ ని తాను రీప్లేస్ చేస్తున్నట్టుగా టాక్. మొత్తానికి అయితే పాన్ ఇండియా లెవెల్లో క్రిష్ బాగానే ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు