“పుష్ప 2” షూట్ స్టార్ట్ లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది.!

Published on Jun 11, 2022 2:06 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “పుష్ప”. మొత్తం రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఇపుడు ఇదే పాన్ ఇండియా సినిమా పుష్ప పార్ట్ 2 కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇపుడు ఈ సినిమా పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది.

మరి దీని ప్రకారం అయితే ఈ సినిమా జూలై చివరి నుంచి షూట్ స్టార్ట్ కి సిద్ధంగా ఉందట. అలాగే సాధ్యమైనంత త్వరగా షూటింగ్ చేసి దీనిని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పుడు నయా టాక్. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నే భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :