అఖిల్ “లెహరాయి” ఫుల్ వీడియో సాంగ్ విడుదల!

అఖిల్ “లెహరాయి” ఫుల్ వీడియో సాంగ్ విడుదల!

Published on Oct 12, 2021 8:19 PM IST


అఖిల్ అక్కినేని, పూజ హెగ్డే హీరో హీరోయిన్ లుగా కలిసి నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రం కి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన లెహరాయి లిరికల్ సాంగ్ ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

శ్రీమణి లిరిక్స్ రాయగా, సిద్ శ్రీరామ్ పాడటం జరిగింది. ఈ పాటకి మొదటి నుండి మంచి స్పందన వస్తోంది. అల్లు అరవింద్ సమర్పణ లో గీతా ఆర్ట్స్ 2 పతాకం పై ఈ చిత్రాన్ని బన్నీ వాసు మరియు వాసు వర్మ లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ను అక్టోబర్ 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు