లై రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు! అనుకున్నట్లే ఆగష్టు 11న!
Published on Aug 3, 2017 3:33 pm IST


నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లై. మణిశర్మ సంగీత సారధ్యంలో ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా సాంగ్స్ మంచి జోష్ గా దూసుకుపోతున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని గత కొద్ది రోజులుగా ఓ న్యూస్ ప్రచారంలో ఉంది. అయితే దానికి ఇప్పుడు ఓ క్లేరిటి వచ్చింది.

చిత్ర నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర రిలీజ్ డేట్ పై వివరణ ఇచ్చారు. ఈ సినిమా ముందు ప్రకటించిన విధంగానే ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకి వస్తుందని ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. దీంతో ఇంత వరకు సినిమా రిలీజ్ పై వచ్చిన రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడ్డట్లు అయ్యింది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులకి మంచి అంచనాలు ఉండగా. ఇందులో ఓ కీలకమైన పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నాడు.

 
Like us on Facebook