ఎలుక కూర ఈ హీరోయిన్ కి చికెన్‌ లా అనిపించిందట !

Published on Nov 21, 2021 7:10 pm IST

‘జై భీమ్‌’ సినిమాలో సినతల్లి పాత్ర అందరికి బాగా కనెక్ట్ అయింది. ఆ పాత్రలో మలయాళ నటి లిజొమోల్‌ అంతలా జీవించింది . గిరిజన మహిళగా, గర్భవతిగా నటించి అందరితో కన్నీళ్లు పెట్టించిన లిజోమోల్‌ కొన్ని షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. ఆమె మాటల్లోనే.. నేను ‘జై భీమ్‌’ కోసం బాగా హార్డ్‌ వర్క్‌ చేశాను. రోజూ గిరిజనుల దగ్గరకు వెళ్లేదాన్ని.

వాళ్లతో కలిసి పని చేసేదాన్ని. వాళ్లు పగలు రాత్రి తేడా లేకుండా వేటకు వెళ్తారు. నేను కూడా వాళ్లతో వేటకు వెళ్ళాను. ఈ క్రమంలోనే వాళ్లు ఎలుకలను వేటాడి వండుకుని తినేవారు. అయితే, ఏవి పడితే అవి కాకుండా పొలాల్లో దొరికేవే తినేవారు. నేను కూడా వాళ్లు చేసినవన్నీ చేయాలనుకున్నాను. అందుకే ఎలుక కూర కూడా తిన్నాను’ అని చెప్పుకొచ్చింది.

ఇక ఎలుక కూర ఈ బ్యూటీకి అచ్చం చికెన్‌ లా అనిపించిందని కూడా చెప్పుకొచ్చింది. ఇక తాను ఎలుక కూర తిన్న విషయం తెలిసి నువ్వు ఎలుక కూర తిన్నావా? అని అందరూ షాక్ అయ్యారని కూడా సినతల్లి సెలవిచ్చింది.

సంబంధిత సమాచారం :