బన్నీ సరసన కొత్త హీరోయిన్ కుదిరినట్టేనా !
Published on Apr 19, 2017 8:52 am IST


స్టార్ హీరో అల్లు అర్జున్, రచయిత నుండి దర్శకుడిగా మారనున్న వక్కంతం వంశీ మొదటి సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హరీష్ శంకర్ చేస్తున్న ‘దువ్వాడ జగన్నాధం’ సినిమాతో బిజీగా ఉన్న బన్నీ అది పూర్తవగానే వంశీ ప్రాజెక్టులో పాల్గొంటాడు. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాకు ‘నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ అనే టైటిల్ ను అనుకుంటున్నారు.

తాజాగా ఈ సినిమాలో బన్నీ సరసన దిశా పఠాని హీరోయిన్ గా నటిస్తుందని వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. పూరి, వరుణ్ తేజ్ ల కాంబినేషన్లో వచ్చిన ‘లోఫర్’ చిత్రంతో తెలుగువారికి పరిచయమైన దిశా ఆ తర్వాత మరే తెలుగు చిత్రంలోనూ కనిపించలేదు. గతంలో ఈ సినిమా కోసం కన్నడ హీరోయిన్ ను తీసుకుంటున్నట్టు వార్తలొచ్చాయి. మరి ఈ రెండు వార్తల్లో ఏది వాస్తవమో తెలియాలంటే కాస్త సమయం వెయిట్ చేయాల్సిందే. అల్లు అర్జున్ ఆర్మీ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్, బన్నీ వాసులు సంయుక్తంగా నిర్మించనున్నారు.

 
Like us on Facebook