బాక్సాఫీస్ వద్ద పేలవ ప్రదర్శన తో ఈ చిత్రాలు!

బాక్సాఫీస్ వద్ద పేలవ ప్రదర్శన తో ఈ చిత్రాలు!

Published on Apr 14, 2024 11:29 PM IST

గత వారం రెండు తమిళ సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. అవి విజయ్ ఆంటోని నటించిన లవ్ గురు మరియు ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన DeAr. ఈ చిత్రాలకు పెద్దగా ప్రచారం జరగలేదు. ఈ సినిమాలు వచ్చాయని చాలా మందికి తెలియదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాల పెర్ఫార్మెన్స్ చాలా తక్కువగా ఉందని చెప్పాలి.

లవ్ గురు కొంత ఆక్యుపెన్సీని కనబరుస్తోంది. DeAr మాత్రం చాలా డల్ గా ఉంది. బాక్సాఫీస్ వారీగా చూస్తే ఈ రెండు సినిమాలు ఈ వారం వసూళ్లు సాధించలేకపోయాయి. వీక్ డేస్ స్టార్ట్ అయ్యాక తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలకు ఆదరణ మరింత కష్టతరమవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు