నాన్ విజయ్ రికార్డు ను క్రాస్ చేసిన ధనుష్ !

Published on Dec 6, 2018 4:10 pm IST


తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘మారి 2’ చిత్రం యొక్క ట్రైలర్ కేవలం ఒక్క రోజులోనే కోటి వ్యూస్ ను రాబట్టి కోలీవుడ్ లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన మూడవ ట్రైలర్ గా రికార్డు సృష్టించింది. ఇక ఇప్పటివరకు కేవలం 24గంటల్లో విజయ్ నటించిన ‘సర్కార్’ 24 మిలియన్ల వ్యూస్ ను అలాగే ‘మెర్సల్’ 11.2 మిలియన్ల వ్యూస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేశాయి. బాలాజీ మోహన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ‘మారి’ కి సీక్వెల్ గా రానుంది. ఈ చిత్రంలో ‘ఫిదా’ ఫేమ్ సాయి పల్లవి ఆటో డ్రైవర్ పాత్రలో కనిపించనుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

ధనుష్ సొంత చిత్ర నిర్మాణ సంస్థ వుండెర్ బార్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదలకానుంది. అయితే ఈ చిత్రం తెలుగులో విడుదలయ్యే అవకాశాలు తక్కువేనని సమాచారం.

సంబంధిత సమాచారం :