మారి 2 తెలుగు ట్రైలర్ విడుదలకానుంది !

Published on Dec 11, 2018 4:03 pm IST

తమిళ హీరో ధనుష్, సాయి పల్లవి జంటగా నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘మారి 2’ తమిళ్ తో పాటు తెలుగులోనూ అదే టైటిల్ తో డిసెంబర్ 21న విడుదలకానుందని తెలిసిందే. అందులో భాగంగా ఈచిత్రం యొక్క తెలుగు ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. సూపర్ హిట్ చిత్రం ‘మారి’ కి సీక్వెల్ గా వస్తున్నఈచిత్రాన్ని బాలాజీ మోహన్ తెరకెక్కించాడు.

యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ధనుష్ సొంత చిత్ర నిర్మాణ సంస్థ వుండెర్ బార్ ఫిలిమ్స్ నిర్మించింది. ఇక ఇంతకుముందు మారి తెలుగులో ‘మాస్’ పేరుతో విడుదలై పర్వాలేదనిపించింది. ఇక ఇదిలావుంటే సాయి పల్లవి నటించిన ‘మారి 2, పడి పడి లేచె మనసు’ ఒకే రోజు తెలుగు ప్రేక్షకులముందుకు రానున్నాయి .

సంబంధిత సమాచారం :