ఆ చిత్రంలో నటించడం లేదంటున్న మాధవన్ !

Published on Dec 12, 2018 1:24 pm IST

ఇటీవల ‘సవ్యసాచి’ చిత్రంలో విలన్ గా నటించి తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్సిన మాధవన్ , తాజాగా రవితేజ నటించనున్న కొత్త సినిమాలో విలన్ గా నటించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై మాధవన్ స్పందించారు . ఆవార్తలు జస్ట్ రూమర్స్ మాత్రమేనని వాటిలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన తెలుగులో అనుష్క తో కలిసి ‘సైలెన్స్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఇక రవితేజ నటించనున్న కొత్త చిత్రం తర్వలోనే ప్రారంభం కానుంది. విఐ ఆనంద్ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈచిత్రంలో తమిళ నటుడు బాబీ సింహ ప్రతినాయకుడి పాత్రలో నటించే అవకాశాలు వున్నాయి. ఇటీవల ‘అమర్ అక్బర్ ఆంటొని’ తో హ్యాట్రిక్ డిజాస్టర్లను ఖాతాలో వేసుకున్న రవితేజ ఈకొత్త సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అందుకే సినిమా ప్రారంభం ఆలస్యం అవుతుందని సమాచారం.

సంబంధిత సమాచారం :