స్ట్రయిట్ తమిళ సినిమా చేయడంపై స్పందించిన మహేష్ !

24th, September 2017 - 04:58:55 PM


ప్రస్తుతం మహేష్ బాబు ‘స్పైడర్’ చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. తమిళంలో లాంచ్ అవుతున్న సందర్బంగా తెలుగుతో సమానంగా తమిళ ప్రమోషన్లలో పాల్గొంటున్నారాయన. ఈరోజు ఉదయం చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్లో పాల్గొన్న మహేష్ పలు విశేషాలను పంచుకున్నారు. ఇకపై తన ప్రతి చిత్రాన్ని తమిళంలో కూడా చేస్తారా, స్ట్రయిట్ తమిళ సినిమా చేసే ఆలోచనలు ఏవైనా ఉన్నాయా అనే ప్రశ్నకు మహేష్ చాలా తెలివైన సమాధానమిచ్చారు.

తమిళ సినిమాలు, ద్విభాషా చిత్రాలు చేయడమనేది తన వద్దకు వచ్చేకథను బట్టి, దర్శకుడిని బట్టి ఉంటుందని మహేష్ అన్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని తమిళనాడులో 450 నుండి 500 స్క్రీన్లలో రిలీజ్ చేయనున్నారు. రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ తో పాటు, మహేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాదిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై థ్రిల్లర్ ఈ నెల 27న రిలీజ్ కానుంది.