ఆ హీరోకు మరోసారి అండగా నిలబడ్డ మహేష్!
Published on Oct 23, 2016 4:14 pm IST

mahesh-babu
‘నందిని నర్సింగ్ హోమ్’.. ఆడియో విడుదల ముందు వరకూ ఎవ్వరికీ పెద్దగా పరిచయం కూడా లేని ఈ సినిమా, సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా ఆడియో ఆవిష్కరణ జరుపుకోవడంతో ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత మెల్లిగా ట్రైలర్‌తో ఆసక్తి రేకెత్తించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నాటితరం స్టార్ కామెడీ హీరో నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా విడుదల నాటినుంచే మంచి టాక్ తెచ్చుకొని తన ఉనికిని చాటుకుంటోంది.

ఇక నిన్న ఈ సినిమాను ప్రత్యేకంగా చూసిన మహేష్ కూడా నవీన్ కృష్ణకు అభినందనలు తెలిపారు. నవీన్ విజయ్ కృష్ణ మంచి డెబ్యూట్ సొంతం చేసుకున్నారని, ఈ సక్సెస్ తనకు ఆనందాన్నిచ్చిందని తెలుపుతూ మహేష్ టీమ్‌కు అభినందనలు తెలిపారు. నవీన్‌కు బంధువైన మహేష్ సపోర్ట్‌తో నందిని నర్సింగ్ హోమ్ మంచి క్రేజ్‌నే తెచ్చుకుంటోంది. పీవీ గిరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రావ్య, నిత్యా హీరోయిన్లుగా నటించారు.

 
Like us on Facebook