
సూపర్ స్టార్ మహేష్ బాబు – ‘మిర్చి’ ఫేం కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మరియు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర టీం ఓ యాక్షన్ ఎపిసోడ్ షూట్ లో బిజీగా ఉన్నారు. మహేష్ బాబుపై వచ్చే ఈ యాక్షన్ ఎపిసోడ్ ని హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ని అనల్ అరసు కంపోజ్ చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర టీం రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది. ఈ సినిమాని జూలై 17న రిలీజ్ చెయ్యడానికి సన్నాహలు చేస్తున్నారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతానికి టైటిల్ ఇంకా ఫైనలైజ్ కాని ఈ సినిమాకి ‘శ్రీ మంతుడు’ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.మహేష్ బాబుతో మొదటి సారి శృతి హాసన్ జోడీ కట్టిన ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఫ్రాన్స్ లో ఉంటుందని సమాచారం.

