మహేష్ సినిమాలో మళ్ళి ఆ హీరొయిన్ నటిస్తుందా?
Published on Oct 28, 2017 5:48 pm IST

‘స్పైడర్’ సినిమా తరువాత ప్రస్తుతం మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమా షూటింగ్‌లో బిజీగా గడుపుతున్నాడు, తన తదుపరి చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. మహేష్ బాబు 25వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్ కలిసి నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంభందించి ఒక న్యూస్ బయటికి వచ్చింది, అదేంటంటే…

‘స్పైడర్’ సినిమాలో హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ మళ్ళి మహేష్ బాబు తో నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది, ముందుగా ఈ సినిమాలో పూజా హెగ్డేని కథానాయికగా తీసుకొన్నారని వార్తలు వచ్చాయి, కాని ఆ వార్తలో వాస్తవం లేదని తెలుస్తుంది. ఈ విషయానికి సంభందించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

 
Like us on Facebook