‘మహర్షి’ కోసం అబూ ధాబీకి వెళ్లనున్న మహేష్ !

Published on Jan 21, 2019 10:04 am IST

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కి పొల్లాచిలో జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా భాగం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. అలాగే పొల్లాచిలో షూటింగ్ ఈ వారం చివర్లో ముగియనుంది. తరువాత షెడ్యూల్ మహర్షి చిత్రబృందం హైదరాబాద్ లో చేయనుంది. అలాగే ఆ తరువాత ఈ సినిమా చివరి షెడ్యూల్ ను అబూ ధాబీలో చేయనున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు , అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ ఛానెల్ అయిన జెమినీ టీవీ దక్కించుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :

X
More