ఏప్రిల్ లో మొదలుకానున్న మహేష్ బాబు 25వ సినిమా !

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 24వ సినిమా ‘భరత్ అనే నేను’ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది. ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనుండటంతో ప్రేక్షకుల్లో భారీస్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఫిబ్రవరి చివరి నాటికి ఈ సినిమా పనులన్నీ ముగుస్తాయని తెలుస్తోంది.

దీంతో ఏప్రిల్ నుండి మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమాను మొదలుపెట్టనున్నారు. ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే నటించనుంది. ప్రముఖ నిర్మాతలు అశ్వినీ దత్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాను ఎక్కువ భాగం యూఎస్ లో చిత్రీకరించనున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో ఇతర నటీనటు, సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.