ఉగాదికి రానున్న ‘భరత్ అనే నేను’ టీజర్ ?
Published on Feb 23, 2018 9:29 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రం ఏప్రిల్ 26న విడుదలవ్వాల్సి ఉండగా నిన్న ‘నా పేరు సూర్య’ చిత్ర నిర్మాతలతో జరిగిన చర్చలు కారణంగా కొద్దిగా ముందుకు జరిగి ఏప్రిల్ 20న రానుంది. దీంతో చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని వేగవంతం చేసింది. ముందుగా టీజర్ పనుల్ని మొదలుపెట్టిన టీమ్ మార్చి నెలలో వచ్చే ఉగాదికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉందట.

ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే లండన్లో ఒక షెడ్యూల్ జరుపుకోనుంది. సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా తిరు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నడిచే ఫిక్షనల్ పొలిటికల్ డ్రామగా ఉండనున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook