మహేష్-మురుగదాస్ సినిమా టైటిల్ ఎప్పుడంటే..!
Published on Aug 16, 2016 12:26 pm IST

mahesh-babu
సూపర్ స్టార్ మహేష్ – దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా కొద్దిరోజుల క్రితమే సెట్స్‌పైకి వెళ్ళిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ హైద్రాబాద్‌లో జరుగుతోంది. ఇక మహేష్ పుట్టినరోజున ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలవుతుందనే ప్రచారం జరిగినా, ఫస్ట్‌లుక్ జనవరిలో ఉంటుందని టీమ్ స్పష్టం చేసేసింది. అయితే తాజాగా అందిన సమాచారాన్ని బట్టిచూస్తే ఈ సినిమా టైటిల్‌ను మాత్రం దసరాకే విడుదల చేయాలని టీమ్ భావిస్తోందట. మురుగదాస్, కథకు సరిపడే ఓ మంచి టైటిల్‌ను ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఈ నెలాఖరు వరకూ హైద్రాబాద్‌లోనే పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్న టీమ్, సెప్టెంబర్ 6 నుండి చెన్నైలో షూటింగ్ జరపనుంది. ఇక సగ భాగం షూటింగ్ పూర్తయ్యాక, జనవరి నెలలో, పక్కా ప్లాన్ ప్రకారంగా ఫస్ట్‌లుక్ విడుదల చేయాలని మురుగదాస్ భావిస్తున్నారట. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook