చై “దూత” పై “మజిలీ” దర్శకుడు రివ్యూ.!

చై “దూత” పై “మజిలీ” దర్శకుడు రివ్యూ.!

Published on Dec 6, 2023 8:00 AM IST

టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ సాలిడ్ థ్రిల్లింగ్ సిరీస్ “దూత” ఓటిటి ఆడియెన్స్ ని మెప్పించి అదరగొట్టిన సంగతి తెలిసిందే. తన మొదటి సిరీస్ తోనే నాగ చైతన్య ఓటిటి లో మంచి వెల్కమ్ ని అందుకున్నాడు. అయితే ఈ సిరీస్ పై ప్రముఖులు అంతా ప్రశంసలు కురిపిస్తుండగా లేటెస్ట్ గా చై హిట్ దర్శకుడు “మజిలీ” ఫేమ్ శివ నిర్వాణ దూత పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది.

మరి తాను మాట్లాడుతూ ప్రైమ్ వీడియోలో సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ దూత చూడడం జరిగింది అని, సాగర్ అవధూరిగా చైతు సూపర్బ్ గా చేసారని అలాగే దర్శకుడు విక్రమ్ కె కుమార్ మరోసారి తన మార్క్ స్క్రీన్ ప్లే తో మరోసారి ప్రూవ్ చేసుకున్నారని అలాగే నిర్మాత శరత్ మరార్ గారు అండ్ టీం అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నాను అని తన రివ్యూ అందించాడు. దీనితో ఈ కాంబినేషన్ ఫ్యాన్స్ లో ఇది వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు