“సరిపోదా శనివారం” ఖచ్చితంగా ఇలాంటి సినిమానే.. మేకర్స్ ప్రామిస్

“సరిపోదా శనివారం” ఖచ్చితంగా ఇలాంటి సినిమానే.. మేకర్స్ ప్రామిస్

Published on Apr 10, 2024 7:05 AM IST


నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గస్ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న అవైటెడ్ ఎంటర్టైనింగ్ చిత్రం “సరిపోదా శనివారం”. మరి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తూ వస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక నిన్న ఉగాది కానుకగా నటుడు సాయి కుమార్ ని కూడా పరిచయం చేశారు.

అయితే ఈ చిత్రం ఎలా ఉంటుంది అనే దానిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సరిపోదా శనివారం మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా కాదు అన్ని అంశాలు కలిగిన పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం అని కన్ఫర్మ్ చేయడమే కాకుండా స్యూర్ షాట్ తాము హిట్ కొడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇక ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ ఆగస్ట్ 24న గ్రాండ్ గా సినిమా రిలీజ్ కాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు