సూపర్ స్టార్ మూవీ ట్రైలర్ డేట్ ఫిక్స్ !

Published on Nov 8, 2019 12:00 am IST

మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ పీరియాడిక్ మూవీ మామాంగం. శతాబ్దాల క్రితం కేరళలో ‘మామాంగం’ అనే సాంప్రదాయ ఉత్సవం కారణంగా ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. మళయాళంతో పాటు ఈ మూవీ తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ‘మామాంగం’ మూవీ తెలుగు ట్రైలర్ తేదీని చిత్ర బృందం ప్రకటించింది.

ఈ నెల 9న ఉదయం 11గంటలకు ఈ చిత్ర తెలుగు ట్రైలర్ విడుదల చేయనున్నారు. మళయాలంలో విడుదలైన మామాంగం ట్రైలర్ ఇప్పటికే విశేష ఆదరణ దక్కించుకుంది. కాగా మామాంగం మూవీ మళయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషలలో కూడా విడుదల అవుతుంది. కావ్య ఫిల్మ్ బ్యానర్ పై వేణు కున్నపిళ్లై నిర్మిస్తుండగా ఎం పద్మ కుమార్ దర్సకత్వంలో తెరకెక్కుతుంది.

సంబంధిత సమాచారం :