ఇంటర్వ్యూ : మారుతీ – ‘శైలజారెడ్డి అల్లుడు’ టైటిల్ పాతదే కాని కంటెంట్ కొత్తది!
Published on Sep 8, 2018 2:54 pm IST

‘మహానుభావుడు’ తో సూపర్ హిట్ ను అందుకున్న ప్రముఖ దర్శకుడు మారుతీ తెరకెక్కించిన నూతన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 13న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా మారుతీ మీడియా తో మాట్లాడారు ఇప్పుడు ఈవిశేషాలు మీకోసం ..

సినిమా ఎలా ఉండనుంది ?

నేనుతీసిన అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుంది. నాకు చాలా సంతృప్తి నిచ్చింది. నిన్న సినిమా చూశాను చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా హిట్ అవుతుంది.

నాగ చైతన్య బాడీ లాంగ్వేజ్ ను మార్చేసినట్లున్నారు ?
ఒక నటుడికి అనుభవం వస్తున్న కొద్దీ తనకు తనను సినిమాకు కావలసినట్లుగా మార్చుకోగలడు ఈసినిమాకు చైతు అదే చేశాడు. చాలా యాక్టీవ్ గా ఈసినిమాలో నటించాడు. కొన్ని కొన్ని సీన్ల లో వాళ్ళ నాన్న గారు నాగార్జున ను చూసినట్లుగా అనిపించింది. తన పాత్రకు ఎంతకావాలో అంత వరకు యాక్టీవ్ గా చేశాడు. మాములుగా నేనే రాసుకునేదే కొంచెం వేరే లెవెల్ లో ఉంటుంది. చైతు దాన్ని అందుకున్నాడు. అలాగని ఎక్కడ ఓవర్ యాక్టింగ్ ఉండదు.

ఈచిత్రం దేని గురించి ఉండనుంది ?

టైటిల్ చూడగానే ఇదేదో అత్త, అల్లుడు మధ్య ఛాలెంజ్ లాగా ఆలా ఉండదు అవ్వని అప్పట్లోనే చూసాం. ఇద్దరు ఇగోయిస్టు తల్లి కూతుళ్ళ మధ్య హీరో ఎలా నలిగిపోయి చివరికి తను అనుకున్నది ఎలా సాధించాడు అన్నదే కథ.

నాగ చైతన్యను తీసుకోవడానికి గల కారణం ?
ఈసీనిమాలో హీరో పాత్ర చాలా కూల్ గా పాజిటివ్ మైండ్ సెట్ తో చాలా ఒప్పికతో ఉంటుంది . ఈలక్షణాలకు నాగ చైతన్య కరెక్ట్ గా సరిపోతాడు అని అనిపించింది. ఆయనను చుస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది. సో ఆలా ఈ పాత్రకు చైతు ను తీసుకున్నాను. ఆ పాత్రకు చైతు 100శాతం సూట్ అయ్యాడు.

మీ గత చిత్రాల్లో మాదిరిగా ఈసినిమాలో కూడా ఏమైనా లోపాలు పెట్టారా ?

లేదు. ఈ సినిమాలో ఇగో అనే కాన్సెప్ట్ ఉంటుంది అలాని అది లోపం కాదు అది ఒక గుణం. మనందరికీ ఉండేదే కాకపోతే సినిమాలో కొంచెం డోస్ పెంచా. ఈ ఇగో ఎక్కువతే ఏమవుతుంది దాని తో వచ్చే సన్నివేశాలు చాలా కామెడీ గా ఉంటాయి .

చిత్ర నిర్మాతల గురించి ?

నేను ఇప్పటివరకు నా తీసిన సినిమాలకు నా ఫ్రెండ్స్ నిర్మాతలు గా వున్నారు . ఈసినిమాకు వేరే నిర్మాతలు . కానీ నాగవంశీ , రాధాకృష్ణ గారు నేను ఏది అడిగితే అది ఇచ్చారు. వాళ్లు ముందే చెప్పారు బడ్జెట్ పెంచండి అని కానీ నా పరిధిలో మంచి క్వాలిటీతో ఈసినిమా తీసాను.

మీ తదుపరి చిత్రాల గురించి ?

యూవీ క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఒక చిత్రం చేస్తున్న తరువాత మహేష్ బాబు గారి సిస్టర్ మంజుల గారు నిర్మాతగా ఇంకో సినిమాకు కమిట్ అయ్యాను.

విజయ్ దేవరకొండతో సినిమా గురించి ?

విజయ్ దేవరకొండతో తీయాలని వుంది. నేను డైరెక్ట్ చేయాలనుకున్న హీరోలలో విజయ్ కూడా వున్నాడు. విజయ్ కూడా అడిగాడు సినిమా చేద్దాం సార్ అని మంచి కంటెంట్ దొరికితే త్వరలోనే తీస్తా.

  • 1
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook