రజనీ, అమితాబ్ మాసివ్ మల్టీస్టారర్ ఫిక్స్.!

Published on Jun 11, 2023 12:00 am IST

ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి పలు దిగ్గజ స్టార్ నటుల్లో ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా నటుల్లో ఒకరైన సీనియర్ హీరోలు తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ లు కూడా ఒకరు. మరి ఇన్నేళ్ల వయసులో కూడా ఇప్పటికీ యాక్షన్ సబ్జెక్టు లు భారీ చిత్రాలు చేస్తూ నేటి తరాల వారికి ఎంతో ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ గా ఉన్న తాము కొన్ని దశాబ్దాల కితం ఒకే చిత్రంలో కలిసి నటించిన సందర్భాలు ఉన్నాయి.

అయితే ఇప్పుడు కాలం మారడంతో మల్టీస్టారర్ లు కూడా తగ్గి మళ్ళీ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. అలా దాదాపు మూడు దశాబ్దాలు తర్వాత ఈ సెన్సేషనల్ కాంబినేషన్ అయితే రిపీట్ కానున్నట్టుగా తెలుస్తుంది. అయితే రజిని తన కెరీర్ లో 170వ చిత్రాన్ని దర్శకుడు టిజి జ్ఞ్యానవేల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ ప్రాజెక్ట్ తో అయితే ఈ మాసివ్ కొలాబరేషన్ సాధ్యం కాబోతుంది అని తెలుస్తుంది. మరి దీనిపై మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉన్నాయి.

సంబంధిత సమాచారం :