ఖైధీ కోసం మెగా అభిమానుల మెగా మీటింగ్ !
Published on Nov 30, 2016 5:10 pm IST

khaidi150
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైధీ నెం 150’ కోసం అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దాదాపు 9 సంవత్సరాల తరువాత తమ రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ చిత్రం ఘానా విజయం సాధించాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. కోరుకోవడం మాత్రమే కాకుండా సినిమా విజయానికి తమ వంతు భాద్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే కొన్ని అభిమాన సంఘాలు పూజలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సినిమాకి గొప్పవిజయం దక్కాలని కోరుకుంటుంటే కొన్ని జిల్లాల అభిమానాలు మాత్రం భవిష్యత్ కార్యాచరణ కోసం పెద్ద స్థాయి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే కృష్ణ, గుంటూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల అభిమాన సంఘాల అధ్యక్షులు, కార్యదర్శిలు, ఉపాధ్యక్షులు అందరూ కలిసి అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో రేపు డిసెంబర్ 1న విజయవాడలోని రెడ్ క్రాస్ రోటరీ బ్లడ్ బ్యాంక్ వేదికగా భారీ స్థాయి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో సినిమా భారీ స్థాయి విజయాన్ని సాధించడానికి మెగా అభిమానులు ఎలాంటి పాత్ర నిర్వహించాలి,వారి కర్తవ్యమేమిటి అనే దానిపై సమగ్ర స్టాయిలో చర్చలు జరగనున్నాయి.

 
Like us on Facebook