రోజు రోజుకీ స్పీడందుకుంటున్న మెగా హీరో సినిమా !
Published on Jul 3, 2017 11:43 am IST


మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న చిత్రం ‘జవాన్’. రచయిత నుండి దర్శకుడిగా మారిన బివిఎస్ రవి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆరంభమైన రోజు నుండే ఎక్కడా ఆలస్యమనేదే లేకుండా చక చకా పనులు జరుపుకుంటున్న సినిమా యొక్క షూటింగ్ మొత్తం ఇటీవలే పూర్తికాగా హీరో ధరమ్ తేజ్ తన వంతు డబ్బింగ్ మొదలుపెట్టేశాడు.

ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ చేయనున్నారు. మెహ్రీన్ కౌర్ ప్రిజాద హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ధరమ్ తేజ్ దేశమా, కుటుంబమా అనే సంఘర్షణను ఎదుర్కునే ఒక భాద్యత గల యువకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇకపోతే ఎస్. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మిస్తున్నారు. ‘తిక్క, విన్నర్’ వంటి పరాజయాల అనంతరం చేస్తున్న ఈ ఈ చిత్రం కావడంతో ‘జవాన్’ తేజ్ కెరీర్ కి కీలకంగా మారింది.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook