సప్తగిరి సినిమా ట్రైలర్ ను లాంచ్ చేయనున్న మెగా హీరో !
Published on Nov 16, 2017 4:28 pm IST

కమెడియన్ నుండి హీరోగా మారి ఇప్పటికే ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ అనే సినిమా చేసి ప్రస్తుతం ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ తో త్వరలోనే మన ముందుకు రానున్నాడు నటుడు సప్తగిరి. ఇదివరకే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ దక్కడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. హిందీ సినిమా ‘జాలీ ఎల్.ఎల్.బి’ కు తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సప్తగిరి లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇకపోతే ఈ సినిమా యొక్క ట్రైలర్ ను మెగాహీరో రామ్ చరణ్ తేజ్ రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇదే గనుక జరిగే సినిమాకు మంచి హైప్ రావడం ఖాయం. గతంలో ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ సినిమా ఆడియోను పవన్ కళ్యాణ్ స్వయంగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. చర్మం లక్కాకుల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను రవికుమార్ నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook