పవన్ విషయంలో ఆసక్తిగా మారిన ‘మెగా’ రియాక్షన్.!

పవన్ విషయంలో ఆసక్తిగా మారిన ‘మెగా’ రియాక్షన్.!

Published on Nov 4, 2022 9:00 PM IST

గత రెండు రోజులు నుంచి కూడా ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో పలు సంచలన వార్తలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. పవన్ కి అయితే ప్రాణ హాని ఉందని పలు షాకింగ్ అంశాలు మొన్నటి నుంచి ఒకదాని తర్వాత ఒకటి అయితే బయటకి వచ్చి సంచలనంగా మారుతున్నాయి.

మరి ఇదిలా ఉండగా మరోపక్క పవన్ కి అయితే మరింత భద్రత కల్పించాలని అభిమానులు పవన్ పార్టీ శ్రేణులు కోరుకుంటుండగా మరో పక్క పవన్ కి ఆల్రెడీ చరణ్ అయితే మరింత భద్రతా బలగాలు ఏర్పాటు చేసినట్టుగా టాక్ నడుస్తుంది. ఇక ఇదిలా ఉండగా వీటి అన్నిటికన్నా కూడా అసలైన మెగా రియాక్షన్ కోసం అయితే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అదే పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి నుంచి. మరి తన తమ్ముడుపై అయితే ఇలాంటి వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తుండగా అసలు మెగాస్టార్ వరకు ఈ వార్త వెళ్లిందా వెళితే తాను ఏ విధంగా స్పదించనున్నారు అనే అంశం మెగా ఫ్యాన్స్ లో చాలా ఉత్కంఠభరితంగా మారింది. మరి మెగాస్టార్ నుంచి అయితే ఏమన్నా న్యూ వస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు