“గుడ్ లక్ సఖి” ప్రీ రిలీజ్ వేడుక కి ముఖ్య అతిథిగా చిరంజీవి

Published on Jan 26, 2022 8:01 am IST


కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నగేష్ కుకునూరు దర్శకత్వం లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం గుడ్ లక్ సఖి. ఈ చిత్రం లో కీర్తి సురేష్ షూటర్ గా కనిపించనుంది. వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర పాడిరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం ను జనవరి 28 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో ప్రీ రిలీజ్ వేడుక కి చిత్ర యూనిట్ తగు ఏర్పాట్లు చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు. పార్క్ హయత్ లో సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఆది పినిశెట్టి, జగపతి బాబు లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :