సుమ షోలో మెగాస్టార్..డీటెయిల్స్ ఇవే.!

సుమ షోలో మెగాస్టార్..డీటెయిల్స్ ఇవే.!

Published on Jan 6, 2023 1:00 PM IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర వెండితెరపై మెగాస్టార్ చిరంజీవికి ఎలా అయితే తిరుగు లేదో అదే విధంగా మన తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర అయితే యాంకర్ సుమ కూడా ఓ తిరుగులేని యాంకర్ గా నిలిచారు అని చెప్పాలి. మరి మెగాస్టార్ సినిమాల ఈవెంట్స్ కి సుమ యాంకర్ గా ఎన్నో సినిమాలు చేయగా ఇప్పుడు లేటెస్ట్ గా అయితే సుమ హోస్ట్ చేస్తున్న షో లో మెగాస్టార్ గ్రేస్ చేయనున్నట్టుగా ఇప్పుడు వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి.

రీసెంట్ గానే సుమ యాంకర్ గా ఈటీవీలో క్యాష్ ప్రోగ్రాం ముగిసి ఇప్పుడు సరికొత్త ప్రోగ్రాం “సుమ అడ్డా” లోకి వచ్చారు. మరి ఈ ప్రోగ్రాం లో అయితే సుమ తో కలిసి మెగాస్టార్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో చిరు తో పాటుగా తన లేటెస్ట్ చిత్రం వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ కూడా కనిపించనున్నారట. అలాగే ఈ మాసివ్ ఎపిసోడ్ ఈ జనవరి 14న అంటే వాల్తేరు వీరయ్య రిలీజ్ అయ్యిన నెక్స్ట్ డే ఈటీవీ లో టెలికాస్ట్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు