‘కొరటాల’ నవంబర్ నుండి మొదలెడతాడట !

Published on Jul 22, 2019 3:33 pm IST

మెగాస్టార్ చిరంజీవి తన తర్వాత సినిమాను దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో మొదలు కానుందని.. పలాస ప్రాంతంలో వరుసగా ఇరవై రోజులు పాటు షూట్ చేయనున్నారని తెలుస్తోంది. సినిమాలో కొన్ని సన్నివేవాలు పల్లెటూరి నేపథ్యంలో ఉంటాయట. చిరంజీవి కోసం కొరటాల శివ ఓ సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు ఉన్నాడు.

మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను రాయడంలో కొరటాలకి మంచి పట్టు ఉంది. ఇక డైలాగ్ రైటర్ గా కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన అతికొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. తన సినిమాల అన్నిటిలో మంచి మెసేజ్ కూడా ఉండేలా చూసుకుంటాడు కొరటాల. మెగాస్టార్, ప్రస్తుతం స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ సైరా నర్సింహారెడ్డి’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా ఆగష్టు చివరి వారం కల్లా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కానుంది.

సంబంధిత సమాచారం :