జగన్ తో మీట్ అనంతరం చిరు ఆసక్తికర కామెంట్స్ వైరల్.!

Published on Jan 13, 2022 4:00 pm IST

ఈరోజు ఉదయమే టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్ ని కలవడానికి విజయవాడ బయల్దేరిన సంగంతి అందరికీ తెలిసిందే. మరి ఈ ఆసకస్మిక భేటీ ప్రకటనతో ఇండస్ట్రీ వర్గాలు అంతా ఈ మీటింగ్ వైపే ఆసక్తిగా చూసారు.

అయితే ఏపీలో టికెట్ ధరలు సమస్య ఇతర అంశాలపై చిరు మాట్లాడుతారని ఈ మీటింగ్ లో సారాంశం. మరి ఈ మీటింగ్ కంప్లీట్ అయ్యాక మెగాస్టార్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. “శ్రీ వై ఎస్ జగన్ గారి పిలుపు ఎంతో భాద్యతగా అనిపించింది అని, ఇండస్ట్రీకి సంబంధించి రెండు వైపుల సమస్యలు కూడా వినాలన్నారు.

అలాగే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయాన్నే తీసుకుంటానని హామీ ఇచ్చారని, ఈ వారం పది రోజుల్లో కొత్త జిఓ కూడా రావచ్చని ఇంకా ఏపీలో 5వ ఆట పర్మిషన్ పై కూడా పునరాలోచన చేస్తామని” తెలిపినట్టుగా మెగాస్టార్ తెలిపారు. దీనితో మెగాస్టార్ భేటీ సక్సెస్ అయ్యినట్టే అనిపిస్తుందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :