బన్నీ 20 ఏళ్ల ప్రయాణంపై మెగాస్టార్ పోస్ట్.!

Published on Mar 29, 2023 1:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గానే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అడుగు పెట్టి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మరి దీనిపై బన్నీ కూడా ఓ పోస్ట్ తో ఎంతో ఆనందాన్ని పంచుకున్నాడు అలాగే అనేకమంది సినీ తారలు కూడా బన్నీ కి కంగ్రాట్స్ తెలిపారు. మరి ఇప్పుడు అయితే బన్నీ కి ఎంతో ఇష్టమైన తన ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి కూడా బన్నీ 20 ఏళ్ల సినీ ప్రస్థానంపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో స్పందించారు.

డియర్ బన్నీ అంటూ సినిమాల్లో నువ్ 20 ఏళ్ళు కంప్లీట్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. నీ చిన్ననాటి జ్ఞ్యాపకాలు ఇంకా ఫ్రెష్ గానే ఉన్నాయి నువ్ ఇప్పుడు ఓ పాన్ ఇండియా స్టార్ గా ఐకాన్ స్టార్ గా మారడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. నువ్ మరింత ఎత్తుకి ఎదగాలి మరింత అభిమానాన్ని గెలవాలని కోరుకుంటున్నాను అని మెగాస్టార్ బ్యూటిఫుల్ పోస్ట్ అయితే షేర్ చేయగా చిరు మరియు బన్నీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :