రజినీకు మెగాస్టార్ స్పెషల్ కంగ్రాట్స్.!

Published on Apr 1, 2021 1:05 pm IST

వన్ అండ్ ఓన్లీ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఈరోజు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ పాల్కే అవార్డును ఈరోజు ఉదయం యూనియన్ మినిస్టర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇండియన్ సినిమాలో తలైవర్ పోషించిన పాత్రకు గాను ఈ ఉన్నతమైన అవార్డును ప్రకటించినట్టుగా తెలియజేసారు. మరి ఇదిలా ఉండగా రజినీకు ఇలాంటి ఉన్నతమైన గౌరవం దక్కడంతో మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై రజినీకు తమిళ్ లో స్పెషల్ విషెష్ కూడా చెప్పారు. తన ఫ్రెండ్ కు ఈ అవార్డు ప్రధానం కావడం చాలా ఆనందం కలిగించింది అని రజినీ నిజంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు అర్హులే అని తెలిపారు. అంతే కాకుండా ఇండస్ట్రీకు రజినీ అందించిన సేవలు అనన్య సామాన్యం అని తన హృదయ పూర్వక శుభకాంక్షలు తెలియజేస్తున్నాని మెగాస్టార్ తెలిపారు. అలాగే మరోపక్క రజినీకి తమిళ నాట స్టార్స్ అంతా కూడా తమ కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు.

సంబంధిత సమాచారం :